ఇపుడు టాలీవుడ్ లో ఉన్న మంచి క్రేజీ అండ్ అవైటెడ్ కాంబినేషన్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే యంగ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో కూడా మూడో చిత్రమే “గుంటూరు కారం” కూడా ఒకటి. మరి ఈ భారీ చిత్రం కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి ఈ గ్యాప్ లో ఓ షాకింగ్ లీక్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి మొదటి పాటని ఇప్పటికే నిర్మాత కన్ఫర్మ్ చేయగా ఈ గ్యాప్ లోనే సాంగ్ బయటకి వచ్చేయడం షాకింగ్ గా మారింది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే సాంగ్ లీక్ వెనుక కారణం ఎవరు కావచ్చు అంటే అందరి వేళ్ళు ఇపుడు సంగీత దర్శకుడు థమన్ వైపే చూపిస్తున్నాయి.
ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన వస్తున్నా లీక్ సాంగ్స్ లో థమన్ వే ఉన్నాయి. మొన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ సాంగ్ లీక్ అవ్వగా దానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇక ఈ తర్వాత ఇప్పుడు గుంటూరు కారం నుంచి సాంగ్ వచ్చింది. దీనితో ఈ రెండు లీక్ సాంగ్స్ కూడా థమన్ వే కావడంతో డౌట్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి.
ఇదే కాకుండా మహేష్ తో గతంలో సర్కారు వారి పాట సమయంలో కూడా మహేష్ సాంగ్ థమన్ కంపోజ్ చేసిందే లీక్ అయ్యింది. దీనితో ఈ లీక్స్ అన్నిటి వెనుక థమన్ ఉన్నాడా అని చాలా మందిలో డౌట్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి. ఇప్పటివరకు అయ్యితే మేకర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.