Thanekella Bharani: సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలకు సంబంధించిన విషయం వచ్చిందంటే చాలు నిమిషాల్లో వైరల్‌గా మారిపోతూ ఉంటుంది. ఇక ఎవరైనా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెబితే ఆ వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టడం షరా మామూలే. అదే తరహాలో ఓ ప్రముఖ నటుడి గురించి ఓ సంచలన వార్త సంచలనం సృష్టిస్తోంది. ఆయనే తనికెళ్ల భరణి.
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, దర్శకుడిగా తనికెళ్ల భరణికి మంచి పేరున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఎలాంటి పాత్ర అయినా సరే లీనమైపోయి, ఆ క్యారెక్టర్‌కు 100శాతం న్యాయ చేకూర్చడంలో ఆయన దిట్ట. కేవలం తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి మొత్తం 750 కి పైగా నటించిన ఆయన, తన నటనతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. కాగా ఆయన కెరీర్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఒకానొక సమయంలో ఒక ఫైట్ మాస్టర్ తనను దారుణంగా అవమానించారంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.
తాను వివాహం చేసుకొని మొదటిసారి హైదరాబాద్ వచ్చినపుడు రాళ్లపల్లి ఇంట్లో అద్దెకు ఉండేవాడినని, ఆ సమయంలో తన ఇంటికి వచ్చిన ఓ ఫైట్ మాస్టర్ భీమ రాజు అనే వ్యక్తి ఏంటయ్యా కొత్తగా పెళ్లయింది ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నావు.. నాకు పెద్ద ఇల్లు ఉంది కొనాలి అనిపిస్తే చెప్పు, వచ్చి చూడు అని చెప్పారని, ఆ తర్వాత తాను వెళ్లి చూడగా, తనకు నచ్చిందని వెంటనే లక్ష రూపాయలు ఇచ్చానని, అదే ఇంట్లో సంవత్సరం పాటు ఉన్నామని ఆయన చెప్పారు. ఆ తర్వాత తనకు అవకాశాలు లేక, ఆర్థికంగా బాగా లేనపుడు ఆ ఫైట్ మాస్టర్ వచ్చి, మొత్తం డబ్బులు ఒకేసారి చెల్లించాలని, లేదంటే ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసరికి తనకు భాదేసిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే అప్పటి వరకు ఇచ్చిన డబ్బు కూడా ఆయన తిరిగి ఇవ్వలేదని, కానీ ఎలాగోలా ప్రయత్నం చేసి 75వేల రూపాయల వరకు అతని నుంచి రాబట్టుకోగలిగానని తనికెళ్ల భరణి వివరించారు.