అరుంధతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది అనుష్క శెట్టి. ఈ సినిమా తర్వాత అనుష్క కోసమే మేకర్స్ ప్రత్యేకంగా కథ లు సిద్దం చేయించారు. స్టార్ హీరో రేంజ్ లో బడ్జెట్ కేటాయించారు. అలా వచ్చిన సినిమాలే పంచాక్షరి, అరుంధతి, సైజ్ జీరో వంటి సినిమాలు. అదే విధంగా ఇప్పుడు “నిశ్శబ్దం” సినిమా తెరకెక్కింది. ఒక వైపు సింగం సిరీస్ లాంటి కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు కథ నచ్చితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో హీరోయిన్ గా చేస్తూ వస్తోంది.
కాగా అనుష్క లేటెస్ట్ సినిమా “నిశ్శబ్దం” గత కొన్ని రోజులుగా ఎలా రిలీజ్ చేస్తారన్న క్యూరియాసిటీ అందరిలోను నెలకొంది. ఈ సినిమాకి కథ అందించడంతో పాటు ఒక నిర్మాత అయిన కోన వెంకట్ ఎటువంటి పరిస్థితుల్లోను ఈ సినిమాని థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కాని తప్పని పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఒక క్రైమ్ అండ్ హర్రర్ థ్రిల్లర్ లా కనిపిస్తుందని ప్రేక్షకులకి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నిశ్శబ్దం” సినిమా కి ఇన్స్పిరేషన్ ఒక అధ్భుతమైన సినిమా అని తెలుస్తుంది. దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ కథ ని లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన “పుష్పక విమానం” సినిమా ఆధారంగా తెరకెక్కించినట్టు చెప్పుకొచాడు. అప్పట్లో ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రయోగం. సింగీతం శ్రీనివాసరావు అంటే ప్రతీ ఒక్కరికి వెంటనే గుర్తొచ్చేది ఈ సినిమానే.
ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించాడు. ఆయన కెరీర్ లో ఈ సినిమా మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ని ఉపయోగించుకొని ట్రెండ్ కి తగ్గట్టుగా “నిశ్శబ్దం” సినిమాని తెరకెక్కించాడట. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా వచ్చే అక్టోబర్ నెల 2న డిజిటల్ ప్రీమియర్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానుంది. అయితే రేపు సినిమా రిలీజయ్యాక ఈ సినిమా.. ఆ సినిమా కి కాపీ అంటూ కొందరు ట్రోల్ చేస్తారన్న ఉద్దేశ్యంతోనే ముందు కాగ్రత్తగా ఈ సీక్రెట్ దర్శకుడు హేమంత్ మధుకర్ రివీల్ చేసి ఉండొచ్చునని టాక్ నడుస్తోంది.