శృతిహాసన్ తన కెరియర్లో ఇన్ని సినిమాలను రిజెక్ట్ చేసిందా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కమల్ హాసన్ వారసురాలిగా శృతిహాసన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వాటిని ఎదుర్కొని ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన సత్తా ఏంటో నిరూపించారు. ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే ఈమె ప్రేమలో పడి తన కెరీయర్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. అనంతరం రవితేజ నటించిన క్రాక్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది.

ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి.ఇప్పటికే ప్రభాస్ బాలకృష్ణ చిరంజీవి వంటి హీరోల సరసన నటించే అవకాశం అందుకొని ప్రస్తుతం ఈ సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ తన కెరియర్లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు. అయితే ఈమె రిజెక్ట్ చేసిన సినిమాలలో హిట్ అయిన సినిమాలు కూడా ఉండడం గమనార్హం.

మరి శృతిహాసన్ తన కెరియర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే… పూరి జగన్నాథ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం బిజినెస్ మెన్.ఈ సినిమాలో ముందుగా నటించే అవకాశం శృతిహాసన్ కి రావడంతో ఈమె కొన్ని కారణాలవల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేసింది. అదేవిధంగా నాని హీరోగా నటించిన జెర్సీ, ప్రభాస్ హీరోగా నటించిన రెబల్, అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం, రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలలో ముందుగా నటించే అవకాశం శృతిహాసన్ కి వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలకు నో చెప్పారు. అయితే వీటిలో ఎక్కువ శాతం హిట్ అయిన సినిమాలు ఉండడం విశేషం.