ట్రైలర్ టాక్ : మైండ్ బ్లోయింగ్ గా “హనుమాన్” ట్రైలర్

ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు తెలుగు సినిమాలు ఏ రేంజ్ లో ముద్ర వేసాయి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఈ ఏడాదిలో మాత్రం మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సెట్ చేసిన సినిమాలు మాత్రం తెలుగు నుంచి రాలేదు. అయితే ఫైనల్ గా “సలార్” సినిమా రాబోతుండగా ఈ సినిమా తర్వాత వచ్చే ఏడాది జనవరిలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతుంది.

ఆ సినిమానే “హనుమాన్”. అవ్వడానికి చాలా చిన్న హీరోతోనే సినిమా వస్తుండగా యంగ్ హీరో తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పుడు అవైటింగ్ గా ఉన్న ట్రైలర్ ని చిత్ర యూనిట్ ఎట్టకేలకి రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ మాత్రం విజువల్స్ పరంగా మరియు ఏక్షన్ పరంగా టాప్ నాచ్ లో ఉన్నాయి.

అయితే హనుమాన్ ట్రైలర్ లో విలన్ పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా హాలీవుడ్ లెవెల్లో కనిపిస్తున్నాడు. తన ఆర్మీ పై విజువల్స్ అందులో జెట్ ఫ్లై లు లాంటివి చూస్తే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంతే కాకుండా హనుమాన్ శక్తులు ఓ సామాన్య యువకుడికి వస్తే ఎలా ఉంటుంది..

అనేది క్లైమాక్స్ లో ఏక్షన్ బ్లాక్ గాని అలాగే హనుమంతుణ్ణి చూపించే సీన్స్ గూజ్ బంప్స్ ఇచ్చే లెవెల్లో ఉన్నాయి. మరి ఈ సినిమా అయితే వరల్డ్ వైడ్ గా 11 భాషల్లో వచ్చే ఏడాది జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
HanuMan Official Trailer - Telugu | Prasanth Varma | Teja Sajja | Primeshow Entertainment