జై “హనుమాన్”.. యూఎస్ మార్కెట్ లో నెవర్ బిఫోర్ ఫీట్..!

ఈ ఏడాదిలో టాలీవుడ్ సినిమా నుంచి పలు అడ్డంకుల నడుమ రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో ఒక కనీ వినీ ఎరుగని రీతి భారీ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న మాసివ్ హిట్ చిత్రం “హనుమాన్” కూడా ఒకటి. యువ హీరో తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ ల నుంచి వచ్చిన ఈ ఇండియన్ సూపర్ హీరో మైథలాజికల్ డ్రామా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

చిత్ర యూనిట్ ముందు నుంచి చెబుతున్న విధంగా మాది లాంగ్ రన్ ఉండే సినిమా అన్ని ముందే చెప్పారు. సరిగ్గా వాళ్ళు చెప్పినట్టుగా లాంగ్ రన్ లో హనుమాన్ దూసుకెళ్తున్నాడు. జాగా ఈ భారీ చిత్రం యూఎస్ మార్కెట్ లో అయితే వండర్స్ సెట్ చేస్తుంది. కాగా తెలుగు నుంచి ఉన్న హైయెస్ట్ గ్రాసర్ లిస్ట్ లో చూస్తే టాప్ 5 వరకు కూడా దర్శకుడు రాజమౌళి ప్రభాస్ చిత్రాలే ఉండగా ఇప్పుడు హనుమాన్ ఈ లిస్ట్ లో చేరి సంచలనం సెట్ చేసింది.

కాగా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో అల వైకుంఠపురములో సినిమా 3.61 మిలియన్ డాలర్స్ గ్రాస్ తో టాప్ 5 లో ఉండగా దీనిని ఇప్పుడు హనుమాన్ కేవలం మొదటి వారం రన్ తోనే 3.65 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసి బహుబలి, RRR అలాగే సలార్ మరియు బాహుబలి 1 చిత్రాల తర్వాత నిలిచింది. దీనిబట్టి హనుమాన్ ఎంత పెద్ద హిట్ అనేది అంతా అర్ధం చేసుకోవాలి.

ఇక ఇది కేవలం మొదలు మాత్రమే కాగా ఈ సినిమా ముందు రోజుల్లో మరిన్ని వండర్స్ సెట్ చేస్తుంది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అయితే అసలు ఈ చిన్న సినిమా చిన్న కాస్టింగ్ వచ్చింది మాత్రం ఈ రేంజ్ వండర్స్ సెట్ చేస్తుంది అని బహుశా ఎవరూ కూడా ఊహించి ఉండకపోవచ్చు.