మంచి సంకల్పంతో సినిమా చేసి విడుదల చేస్తే అది వండర్స్ సెట్ చేస్తుంది అని చెప్పడానికి మరో చక్కటి ఉదాహరణ చిత్రమే “హనుమాన్”. ఖచ్చితంగా తమ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అని చిత్ర దర్శకుడు నిర్మాత ప్రశాంత్ వర్మ మరియు నిరంజన్ రెడ్డి లు చెప్పారు.
ఎన్ని అడ్డంకులు ఎదురయినా తట్టుకొని నిలబడ్డారు కానీ సీన్ కట్ చేస్తే యూఎస్ లాంటి మార్కెట్ లో ఎన్నో బిగ్ పాన్ ఇండియా సినిమాలు తర్వాత హైయెస్ట్ రన్ ఉన్న సినిమా లిస్ట్ లో హనుమాన్ చేరేలా కనిపిస్తుంది. ఇక ఈ రేంజ్ లో సంచలనం సృష్టిస్తున్న హనుమాన్ యూఎస్ లో ఫాస్టెస్ట్ 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లో జాయిన్ అయిన సినిమాల్లో ఒకటిగా నిలవగా.
ఇక ఒకొక్కరోజు ముందు రోజు కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతూ ట్రేడ్ వర్గాల్లో షాకింగ్ ఫ్యాక్టర్ గా మారుతుంది. ఇలా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మూడు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈ మొదటి వీకెండ్ లో అదిరే వసూళ్లు కొల్లగొట్టింది. కాగా ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల మార్క్ దగ్గరకి చేరుకోగా ఇక మూడో రోజున ఒక్క ఇండియాలోనే ఈ చిత్రం సుమారు 19 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.
దీనితో హనుమాన్ మొదటి వీకెండ్ కంప్లీట్ చేసుకునేసరికి ఎలా లేదన్నా 70(అంచనా) కోట్ల మార్క్ ని అచీవ్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే హనుమాన్ వసూళ్లు తగ్గించడానికి కొన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ అయినప్పటికీ ఆ సినిమాని క్యాన్సిల్ చేస్తున్నారు. దీనితో స్వల్పంగా నాలుగో రోజు వసూళ్లు డౌన్ అవుతున్నాయి. కానీ లాంగ్ రన్ లో మాత్రం హనుమాన్ ని ఆపేది ఎవరూ లేరని చెప్పాల్సిందే.