బాక్సాఫీస్ : 15 రోజుల్లో “హనుమాన్” మైండ్ బ్లాకింగ్ రన్ 

ఈ ఏడాదిలో అసలు ఎవరు ఊహించని ఒక సెన్సేషనల్ హిట్ ఏదైనా ఉంది అంటే అది “హనుమాన్” సినిమానే అని చెప్పాలి. కాగా టీజర్ తో మంచి అంచనాలు ఈ సినిమా సెట్ చేసుకోగా ట్రైలర్ తర్వాత ఓకే అనిపించింది. కానీ ఇదే బజ్ లో థియేటర్స్ లోకి ఈ సినిమా ఇలా వచ్చింది..

అంతే ఇక మరో మాట లేదు. యూనానిమస్ హిట్ టాక్ తో పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం దుమ్ము లేపడం స్టార్ట్ చేసింది. ఇక అక్కడ నుంచి మొదలైన హనుమాన్ ర్యాంపేజ్ ఇప్పుడు 16 రోజులు కంప్లీట్ చేసుకునేసరికి నెక్ట్ లెవెల్ లోకి వెళ్ళింది. కాగా ఈ చిత్రం నిన్న రిపబ్లిక్ హాలిడేకి కూడా సాలిడ్ వసూళ్లు వరల్డ్ వైడ్ గా అందుకున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ చిత్రం ఈ 15 రోజుల్లో ఏకంగా 250 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరింది. అయితే ఈ మొత్తం కూడా హీరో తేజ సజ్జకి దర్శకుడు ప్రశాంత్ వర్మకి కూడా ఫస్ట్ ఎవర్ రికార్డు కాగా ఈ చిత్రం 100 కోట్ల షేర్ అందుకున్న అతి కొద్ది చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ మొత్తం 15 రోజుల్లో ఈ చిత్రం 128 కోట్ల మేర షేర్ ని అందుకున్నట్టుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అయితే అసలు ఈ చిత్రం మాత్రం ఈ లెవెల్ రన్ ని కొనసాగిస్తుంది అని ఎవరూ ఊహించలేదు.

నిజానికి హిందీలో కానీ 100 కోట్లు వస్తే ఈ సినిమా ఈ రేంజ్ మార్క్ అందుకుంటుంది అని అనుకున్నారు కానీ అక్కడ ఇప్పుడు వరకు 50 కోట్లు మాత్రమే రాగా మిగతా 200 కోట్ల మార్క్ అంతా మన తెలుగు నుంచే మేజర్ గా వచ్చింది. ఇక ఫైనల్ గా హనుమాన్ లెక్క ఎక్కడ ఆగుతుందో అని ట్రేడ్ పండితులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.