“హను మాన్” లో ఆ సస్పెన్స్ మరికొన్ని గంటల్లో.!

తెలుగు సినిమా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ చిత్రం “హను మాన్” ఇప్పుడు మాసివ్ హైప్ రేపి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. మరి తెలుగు రాష్ట్రాల్లో అయితే సెన్సేషనల్ బుకింగ్స్ ని పైడ్ ప్రీమియర్స్ కి గాను నమోదు చేస్తుంది.

అయితే ఈ సినిమా పట్ల టాలీవుడ్ ఆడియెన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉండగా మన తెలుగు నుంచి వస్తున్న మొదటి సూపర్ హీరో సినిమా ఇది కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇక వీటితో పాటుగా మరో క్రేజీ సస్పెన్స్ విషయంలో కూడా మరింత ఆసక్తి ఇప్పుడు నెలకొంది.

అసలు ఈ సినిమాలో భజరంగ్ (హనుమంతునిగా) ఎవరు కనిపిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నగా మారింది. మరి ఇదైతే ఈరోజే రివీల్ కానుంది అని చెప్పాలి. ఈరోజు సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల్లో హను మాన్ ప్రీమియర్ షోస్ పడిపోనున్నాయి. దీనితో ఆ పవర్ ఫుల్ పాత్రని ఎవరు చేస్తారన్నారు అనేది ఈరోజే రివీల్ అయిపోతుంది అని చెప్పాలి.

కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి పేరు గట్టిగా వినిపించింది. మరి ఇది నిజమైతే ఇంకో లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా గెటప్ శ్రీను, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.