ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న భారీ హిట్ చిత్రం అందులోని తెలుగు సినిమా “హనుమాన్”. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ మార్కెట్ సహా యూఎస్ లో కూడా రికార్డు వసూళ్లు హనుమాన్ అందుకొని హీరో తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ కెరీర్ లో అయితే ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఇప్పటికీ స్ట్రాంగ్ వసూళ్లతో వెళ్తుంది.
కాగా ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ స్టాప్ 300 కోట్ల దిశగా వెళుతుండగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం కూడా ఎదురు చూస్తున్న వారు లేకపోలేరు. ఇప్పటికే ఈ చిత్రం థియేటర్స్ లో సెన్సేషనల్ వసూళ్లతో దూసుకెళ్తుంది అయినా కూడా ఓటిటి రిలీజ్ అన్ని ఇతర సినిమాల్లానే వచ్చేస్తుంది అని చాలా మంది అనుకున్నారు.
కానీ హనుమాన్ మేకర్స్ ఎప్పుడో ఈ సినిమా ఖచ్చితంగా ఓటిటిలో ఇప్పుడప్పుడే రాదనీ కన్ఫర్మ్ చేసేసారు. కాగా ఇప్పుడు అయితే కొన్ని ట్రస్టడ్ వర్గాల నుంచి వార్తలు బయటకి వచ్చాయి. దీనితో హనుమాన్ సినిమా ఈ రానున్న మార్చ్ రెండో వారం నుంచే డిజిటల్ రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మ్ అయ్యింది.
అన్నట్టు ఈ సినిమా ఓటిటి రైట్స్ ని ఎవరు కొన్నారంటే జీ 5 వాళ్ళు కొనుగోలు చేశారు. ఇందులో పోస్ట్ థియేట్రికల్ రన్ అనంతరం మళ్ళీ అన్ని రోజులు తర్వాత రానుంది. కాగా అఫీషియల్ డేట్ ఏమిటి అనేది మరికొన్నాళ్లలో క్లారిటీ రానుంది.