హన్సిక పెళ్లికి వెళ్లకుండా ఆ స్టార్ హీరో ని అడ్డుకున్న హీరో భార్య..?

దేశముదురు సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్, హన్సిక కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో హన్సిక తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్న హన్సికకి తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కాయి. ఇలా వరుసగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం హన్సిక తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం తమిళ భాషలో మాత్రమే సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉండగా హన్సిక ఇటీవల తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీన జైపూర్ లోని ప్యాలెస్ లో ఈ వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కేవలం ఒక హీరోకి మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. గతంలో తెలుగు సినిమాలలో నటించే సమయంలో హన్సిక ఆ హీరోతో ప్రేమాయణం నడిపినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కొంతకాలం చిటపటలేసుకొని తిరిగిన వారిద్దరూ కొన్ని కారణాలవల్ల ఒకరికొకరు దూరం అయ్యారు. దీంతో ఆ యంగ్ హీరో మరొకరిని వివాహం చేసుకున్నాడు.

ఇక ఇటీవల జరిగిన తన పెళ్లి వేడుకకు ఆ హీరోని హన్సిక ఆహ్వానించగా.. ఆ యంగ్ హీరో కూడా ఆమె పెళ్లికి వెళ్ళటానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే తన భర్త హన్సికతో నడిపిన ప్రేమ వ్యవహారం తెలుసుకున్న ఆ హీరో భార్య మాత్రం ఈ పెళ్లికి వెళ్లకుండా తన భర్తను అడ్డుకున్నట్లు సమాచారం. హన్సిక పెళ్లికి వెళితే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ఆ స్టార్ హీరోని బెదిరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో మాజీ ప్రేయసి కోసం కట్టుకున్న భార్యను పోగొట్టుకోవటానికి ఇష్టం లేక ఆ స్టార్ హీరో హన్సిక పెళ్లికి వెళ్లకుండా ఉండిపోయినట్లు తెలుస్తోంది.