పెళ్ళైనా .. తన అందంతో ఫిదా చేస్తోంది హన్సిక!

యాపిల్‌ బ్యూటీగా ప్రేక్షకుల చేత పిలుపించుకుంది హన్సిక. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘దేశముదురు’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ అమ్మడు తొలి తోనే ప్రేక్షకులను ఆకర్షించింది. అంతకు ముందు బాలీవుడ్‌ లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా నటించింది.

ఇక ‘దేశముదురు’ హిట్‌ అవ్వడంతో అందరు హీరోలు ఈ అమ్మడినే హీరోయిన్‌ గా కావాలని డిమాండ్‌ చేశారు. దాంతో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో టాలీవుడ్‌ లో దాదాపు అందరు యంగ్‌ హీరోల సినిమాల్లో నటించింది హన్సిక.

అలాగే తమిళ్‌ ఇండస్ట్రీలోనూ మంచి ఆఫర్స్‌ అందుకుంది ఈ బ్యూటీ. అక్కడ కూడా స్టార్‌ హీరోల ల్లో అవకాశాలు అందుకుంది. ఇక ఈ అమ్మడు ఈ ఏడాది పెళ్లిపీటలతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లితర్వాత హన్సిక తిరిగి సినిమాల్లో బిజీ కావాలని చూస్తుంది. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్‌ చేస్తుంది.

తాజాగా మరోసారి గ్లామర్‌ ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్‌. మరోసారి తన అందంతో ఫిదా చేసింది హన్సిక.