కొంపల్లిలో హాల్ ఆఫ్ గేమ్ ప్రారంభించిన నటుడు సిద్ధు జొన్నలగడ్డ.

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా వీకెండ్ వచ్చింది అంటే గేమ్ జోన్స్ లో ఫుల్ బిజీగా ఉంటున్నారు.. ఫ్యామిలీ వచ్చి ఆనందంగా గడపడానికి అడ్డా మారిన గేమ్ జోన్స్ ఇప్పుడు సమర్ కావడంతో పిల్లలకు హాలిడేస్ రావడంతో ఫుల్ గా ఫ్యామిలీ వచ్చి ఈ గేమ్ జోన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు..

హైదరాబాద్: సరికొత్త క్రీడా వినోదాన్ని పంచేందుకు కొంపల్లీలో నూతనంగా ఏర్పాటుచేసిన హాల్ ఆఫ్ గేమ్ గేమింగ్ జోన్ ను సినీనటుడు, డీజే టిల్లు ఫేం సిద్ధు జొన్నలగడ్డ, ప్రముక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జాలు ప్రారంభించారు. దాదాపు 100 క్రీడలు, వీఆర్ గేమ్స్, బౌలింగ్ ఆలే, పార్టీ వేడుకలకు సంబంధించిన జోన్ లను ఇక్కడ ఏర్పాటుచేసి పిల్లలకు, యువతకు పూర్తి వినోదాన్ని అందించేలా దీనిని తీర్చిదిద్దారు.

ఆదివారం ఈ గేమింగ్ జోన్ ను ప్రారంభించిన సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ఆనందం రెట్టింపు చేసే ప్రాంతం ఇది. చిన్నారులకు, యువతను ఈ ప్రాంతం ఖచ్చితంగా కట్టి పడేస్తుంది. శరీరానికి, మెదడుకు పదును పెట్టేలా ఇక్కడ క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారని అన్నారు. హాల్ ఆఫ్ గేమ్ డైరక్టర్ హితేష్ చందానీ మాట్లాడుతూ ఇక్కడ సరికొత్త గేమింగ్ ను అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. ఒక కొత్తదనాన్ని సృష్టించి అందుబాటులోకి తీసుకురావడం వెనుక ఎంతో కష్టం ఉందన్నారు. కుటుంబంతో కలిసి వచ్చి ఇక్కడ ఆనందంగా సమయం గడపవచ్చన్నారు. ఇక్కడ ఆటలు ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ఆయన అన్నారు. నాలుగు లేన్ల బౌలింగ్ ఆలేతోపాటు పార్టీ జోన్లు, ఫుడ్ కోర్టులు ఇలా అన్నింటిని ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చామన్నారు. అంతులేని ఆసందాన్ని అనుభవించడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఖచ్చితంగా రావాలని ఆనం మీర్జా అన్నారు. ఇది ఖచ్చితంగా ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుందన్నారు.