ఇండస్ట్రీ టాక్ : “గుంటూరు కారం” ట్రైలర్ కూడా ఇదే ట్రెండ్ లో??

రానున్న రోజుల్లో టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ లలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. వీరి కాంబినేషన్ లో అయితే వస్తున్నా మూడో సినిమా ఇది కావడంతో మంచి హైప్ అందరిలో నెలకొంది.

అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుండగా ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ కి మాత్రం క్రేజీ ట్రీట్ లు రానున్నాయి. మరి వీటిలో సినిమాలో ఐటెం సాంగ్ ఒకటి కాగా దీని తర్వాత సినిమా ట్రైలర్ ని చిత్ర బృందం రిలీజ్ చేయనున్నారని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

అయితే ఈ చిత్రం నుంచి రీసెంట్ టాలీవుడ్ ట్రెండ్ రెండు ట్రైలర్స్ ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. సలార్ సినిమా రెండు ట్రైలర్స్ తో వస్తుండగా ఇదే బాటలో మొదటి ట్రైలర్ ని అయితే ఈ డిసెంబర్ 31 లేదా జనవరి 1న రిలీజ్ చేయనుండగా రెండో ట్రైలర్ ని అయితే జనవరి 6న రిలీజ్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇంకా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి మరియు శ్రీలీల లు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఈ రానున్న జనవరి 12న సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.