మహేష్ ఫ్యాన్స్ కి ఆ నొప్పి తెలిపిన ప్రొడ్యూసర్..!

ఒకప్పుడు ఓ స్టార్ హీరో సినిమా చేస్తుంటే అది కంప్లీట్ అయ్యే వరకు కూడా తాము అనుకున్న అప్డేట్ తప్ప ఇంకొకటి బయటికి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ కి ముందే ఎన్నెన్నో అప్డేట్స్ వస్తున్నాయి అలా పరిస్థితులు మారాయి. కాగా అలా మారిన పరిస్థితులే ఇప్పుడు సినీ నిర్మాతలు టెక్నీకల్ టీం లకి పెద్ద తల నొప్పిగా మారుతున్నాయి.

ఇపుడు ఇదే ఇబ్బందిని సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం “గుంటూరు కారం” యూనిట్ ఎదుర్కొంటున్నారు. మరి ఈ సినిమా నుంచి వస్తున్నా ఒకో అప్డేట్ ఫ్యాన్స్ కి ఫుల్ గా అయితే శాటిస్ఫై చేయడం లేదు. దీనితో చాలామంది మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మితి మీరు కామెంట్స్ చేస్తున్నారు.

దీనితో ఈ సినిమా నిర్మాత కొడుకు నాగ వంశీ సోషల్ మీడియాలో చాలా హార్ష్ గా సమాధానం ఇవ్వడం మహేష్ ఫ్యాన్స్ ని మరింత ట్రిగ్గర్ చేసింది. అయితే దీనికి క్లారిటీ ఇస్తూ.. ఇపుడు మీకు నొప్పి తెలిసిందా అవతల వ్యక్తులని పర్శనల్ గా అటాక్ చేస్తే ఎలా ఉంటుందో అని అలాగే మీవరకు వస్తే ఇపుడు నొప్పి తెలిసిందా అని తెలిపాడు.

మీరు మీ ఒపీనియన్ ని ఎప్పుడు కూడా మర్యాదగా చెప్తే మేము కూడా అలానే సమాధానం ఇస్తామని తెలిపాడు. ఇవన్నీ పక్కన పెట్టి జనవరి 12న సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని నెవెర్ బిఫోర్ మాస్ లో చూసి ఎంజాయ్ చేద్దాం సిద్ధం కండి అంటూ ఈ సోషల్ మీడియాలో వార్స్ కి ఎండ్ కార్డు వేసాడు.