లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర బ్లాస్టింగ్ సెన్సేషన్ గా మారిన సినిమా “ఆదిపురుష్”. అప్పుడు వరకు ఉన్న అంచనాలు వేరు ఇక ట్రైలర్ వచ్చాక ఏర్పడిన అంచనాలు వేరు అన్నట్టుగా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ లోకి ఈ సినిమా థియేట్రికల్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది.
తెలుగు ,ముఖ్యంగా హిందీలో భారీ రెస్పాన్స్ కొల్లగొడుతున్న ఈ ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తుంది. అయితే గతంలో ఈ భారీ సినిమా టీజర్ కి షాకింగ్ రెస్పాన్స్ రాగా హీరో ప్రభాస్ దర్శకుడు ఓంరౌత్ పై చాలా నెగిటివ్ వచ్చింది. దీనితో అప్పటి వరకు ఉన్న డిమాండ్ అంతా కూడా ఈ సినిమాకి తగ్గిపోయింది.
అలాగే ఓవర్సీస్ లో అయితే అసలు ఈ సినిమా కొనేందుకు కూడా ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాలేదు. అయితే ఇక ఇపుడు ట్రైలర్ చూసాక మెయిన్ గా ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ విన్నాక భారీగా ఇప్పుడు ఆదిపురుష్ కి డిమాండ్ ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఇండియా వైడ్ గా కూడా ఆదిపురుష్ బిజినెస్ లో ఇపుడు భారీ మార్పులు జరగనున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.
దీనితో అయితే మాసివ్ బిజినెస్ ఆదిపురుష్ కి ఆన్ కార్డ్స్ అని చెప్పాల్సిందే. కాగా ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటించారు. అలాగే గ్రాండ్ గా అయితే ఈ సినిమా ఈ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ లో కూడా ఈ మహా కావ్యాన్ని రిలీజ్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.
