శ్రీనువైట్లతో గోపిచంద్‌ కొత్త సినిమా…

మాచో స్టార్‌ గోపీచంద్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్‌ ప్రొడక్షన్‌ నెం.1గా తెరకెక్కనున్న చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. మాస్‌, ఫ్యామిలీస్‌ని మెప్పించే యాక్షన్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లను రాయడంలో, తీయడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల.. కాస్త గ్యాప్‌ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.

హీరో గోపీచంద్‌కు కూడా ఇప్పుడు మంచి హిట్‌ కావాలి. గోపీచంద్‌ను ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో చూపించడానికి శ్రీను వైట్ల.. ఓ హై`వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి మేకర్స్‌ తాజాగా ఓ అప్‌డేట్‌ని వదిలారు. భారీ బడ్జెట్‌తో లావిష్‌గా తెరకెక్కబోతోన్న ఈ చిత్ర షూటింగ్‌ తాజాగా ఇటలీలో ప్రారంభమైనట్లుగా మేకర్స్‌ తెలిపారు. దర్శకుడు శ్రీను వైట్ల కూడా సోషల్‌ విూడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇటలీ, మిలాన్‌లోని కొన్ని అద్భుతమైన లోకేషన్స్‌లో హీరో గోపీచంద్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.

సినిమాలో చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.