రవితేజని మెప్పించని కథతో గోపీచంద్ సినిమా !

Gopi Chand making a movie with a story that Ravi Teja did not want

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు గోపీచంద్.ఎక్కువగా కమర్షియల్ యాక్షన్ కథలకి ప్రాధాన్యత ఇచ్చిన గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సిటీమార్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత తేజ దర్శకత్వంలో అలివేలు వెంకటరమణ అనే సినిమా కూడా లైన్ లో ఉంది.ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సిటీ మార్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.ఇందులో గోపీచంద్ కి జోడీగా తమన్నా నటిస్తుంది.ఇదిలా ఉంటే కమర్షియల్ కామెడీ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.మారుతి మాస్ రాజా రవితేజతో సినిమా చేయాలని అనుకున్నాడు.అయితే తన కథతో రవితేజని మెప్పించలేకపోయాడని టాక్ ఉంది.

Gopi Chand making a movie with a story that Ravi Teja did not want
Gopi Chand making a movie with a story that Ravi Teja did not want

ఇదిలా ఉంటే ఇప్పుడు అదే కథని గోపీచంద్ ని చెప్పి ఫైనల్ చేసుకున్నాడని సమాచారం.ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఉన్న గోపీచంద్ మళ్ళీ లౌక్యం తరహాలో కామెడీ యాక్షన్ నేపధ్యంలో సినిమా చేసి హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.ఈ నేపధ్యంలో మారుతి చెప్పిన కథ బాగా కనెక్ట్ కావడంతో గోపీచంద్ ఒకే చెప్పాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి మారుతి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు బోగట్టా.భిన్నమైన హీరో క్యారెక్టరైజేషన్స్ డిజైన్ చేసుకొని తెరపై వినోదం పండించే మారుతి ఈ సినిమా కోసం హీరోని పక్కా కమర్షియల్ మైండ్ ఉన్న యువకుడుగా ప్రెజెంట్ చేయబోతున్నాడని, అందుకే ఈ సినిమాకి అదే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.