బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ ప్రాంఛైజీ సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇదే జోనర్‌లో వచ్చిన టైగర్ 3 మరోసారి ఈ క్రేజ్‌ను బాక్సాఫీస్‌ను రుచి చూపించింది. మనీశ్ శర్మ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం టైగర్ 3. కత్రినాకైఫ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించిన టైగర్ 3 దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సక్సెస్‌ఫుల్‌గా స్ స్క్రీనింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిల్తుస్తోంది.
టైగర్ 3 ఇప్పటివరకు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.271.50 కోట్లు వసూళ్లు రాబట్టింది. వీటిలో ఇండియా నుంచి రూ.180.50 కోట్లకు పైగా.. ఓవర్సీస్ నుంచి 59.50 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో ప్రేక్షకులు, అభిమాన లోకానికి ధన్యవాదాలు తెలియజేశాడు సల్మాన్ ఖాన్. టైగర్ 3కి ప్రేక్షకులు, అభిమానుల నుండి వచ్చిన స్పందన పట్ల చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు టైగర్ 3 చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ అందించారు.
టైగర్ ఫ్రాంచైజీ మూడో భాగం కూడా విజయవంతమైన కథను అందిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానంటూ తన ఎక్జయిట్‌మెంట్ తెలియజేశాడు సల్లూభాయ్. మరి రానున్న రోజుల్లో టైగర్ 3 నిర్మాతలకు ఇంకెన్ని వసూళ్లు తెచ్చి పెడుతుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు. ఇప్పటికే టైగర్ 3 విషయమేంటంటే సల్లూభాయ్ కెరీర్‌లో రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన 17వ సినిమాగా నిలిచింది. దీంతో ఏ ఇండియన్ స్టార్ హీరో నమోదు చేయని అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పి టాక్ ఆఫ్ ది ఇండస్టీగ్రా నిలుస్తున్నాడు సల్లూభాయ్.
హిందీ, తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన టైగర్ 3లో అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్ బేడి కీలక పాత్రల్లో నటించారు. టైగర్ ప్రాంఛైజీలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై తర్వాత వస్తున్న సినిమా కావడం, అంచనాలకు టైగర్3 ఏ మాత్రం తగ్గకపోవడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఉన్నాయి. టైగర్ 3 ఐమాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదలైంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.