“ఆనిమల్” లో రష్మిక లుక్ కి మంచి స్పందనే.!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర అన్ని ఇండస్ట్రీ వారు కూడా ఒకరితో ఒకరు కలిసి పని చేస్తూ ఉండడం చాలా కామన్ అయిపోయింది. ఇది వరకు అంటే ఒక ఇండస్ట్రీ దర్శకుడు మరో ఇండస్ట్రీ హీరో కలిసి వర్క్ చేస్తే అది చాలా రేర్ కానీ ఇప్పుడు బౌండరీలు బద్దలు కావడంతో అన్నిటికి గేట్లు తెరుచుకున్నాయి.

అలా మన తెలుగు దర్శకుడు హిందీలో వెళ్లి సత్తా చాటాడు. ఆ దర్శకుడే సందీప్ వంగ కాగా తన అర్జున్ రెడ్డి హిందీలో తీసి సెన్సేషనల్ వసూళ్లు అందించాడు. దీనితో అక్కడే భారీ సినిమాల నిర్మాణ సంస్థ టి సిరీస్ తో 5 సినిమాలు సైన్ చేసాడు. అలాగే వారి కాంబోలో చేసిన రెండో సినిమానే “ఆనిమల్”.

బ్రహ్మాస్త్ర హీరో రణబీర్ కపూర్ హీరోగా క్రేజీ ఏక్షన్ డ్రామాగా దీనిని ప్లాన్ చేయగా ఇప్పుడు సినిమా నుంచి అయితే మేకర్స్ ఒకో అప్డేట్ ని ఫస్ట్ లుక్ ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నేషన్ క్రష్ రష్మిక మందన్నా ని ఎంపిక చేసిన సంగతి కూడా తెల్సిందే. ఇలా కంప్లీట్ ఒక పాన్ ఇండియా ప్యాకెడ్ మూవీగా తెరకెక్కుతూ ఉండగా ఇప్పుడు రష్మిక మందన్న పై లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

మరి ఈ లుక్ లో అయితే గీతాంజలిగా రష్మిక అదిరింది అని చెప్పాలి. జెనరల్ గా బాలీవుడ్ అంటే చాలా గ్లామరస్ గా ఎక్స్ పోజింగ్ తో ఉంటుంది అని అనుకుంటారు కానీ సందీప్ వంగ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా రష్మికాని ప్రెజెంట్ చేసాడు. దీనితో ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ ఇపుడు వస్తుంది. 
https://x.com/AnimalTheFilm/status/1705458180682404344?s=20