Prabhas: ప్ర‌భాస్ అభిమానులకు గుడ్ న్యూజ్.. నెక్స్ట్ కిక్కిచ్చే అప్డేట్స్!

పాన్-ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేతిలో ఇప్పుడు ఒకటి, రెండు కాదు, ఏకంగా నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏది ముందు విడుదలవుతుంది, ఏది ఆలస్యమవుతుందనేది తెలియక అభిమానులు అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్ర‌భాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా హారర్ కామెడీ జానర్‌లో మారుతి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో మాళ‌విక మోహ‌న‌న్, నిధి అగ‌ర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా గతంలో విడుదల కావాల్సి ఉన్నా, ప్ర‌భాస్‌కు షూటింగ్ సమయంలో గాయమైన కారణంగా వాయిదా పడింది. గాయం నుంచి కోలుకోవడానికి వైద్యుల సలహాతో ప్ర‌భాస్ ఇటలీలో విశ్రాంతి తీసుకున్నాడు. ఇటీవల ఆయన హైద‌రాబాద్‌కు తిరిగి వచ్చాడు, త్వరలోనే ‘ది రాజాసాబ్’ షూటింగ్‌లో పాల్గొననున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

‘ది రాజాసాబ్’ సినిమాలో ప్ర‌భాస్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని, వింటేజ్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకోనున్నాడని సమాచారం. ఈ సినిమా టీజర్‌ను మే చివరి నాటికి విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ అప్‌డేట్స్‌తో ప్ర‌భాస్ అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. ఇక సినిమా విడుదల తేదీ ఖరారైతే, ఈ ఏడాది సెప్టెంబర్‌లో థియేటర్లలో సందడి చేయడం ఖాయమని అంటున్నారు.