బిగ్ బాస్ హౌస్ లో దెయ్యం.. దాన్ని చూసి దెబ్బకు దడుసుకున్న అరియానా?

ghost in bigg boss house

ఏంటి.. బిగ్ బాస్ హౌస్ లోకి దెయ్యం వచ్చిందా? కొంపదీసి దెయ్యాన్ని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించాడా ఏంటి బిగ్ బాస్ అని అనుకుంటన్నారా? ఏమో నిజమే కావచ్చు. ఎందుకంటే.. నిజంగానే బిగ్ బాస్ హౌస్ లోకి దెయ్యం వచ్చింది. కిచెన్ లో సింక్ దగ్గర ఉన్న అద్దంలో అరియానాకు ఆ దెయ్యం కనిపించింది. దీంతో అరియానా దెబ్బకు దడుసుకుంది. దెయ్యం.. దెయ్యం అంటూ అరిచేసింది. భయపడింది. ఏడ్చేసింది. వామ్మో… దెయ్యాన్ని చూసి ఏడుపును ఆపుకోలేక తెగ ఏడ్చేసింది అరియానా.

ghost in bigg boss house
ghost in bigg boss house

వెంటనే.. అక్కడికి వచ్చిన మిగితా కంటెస్టెంట్లు.. దెయ్యం లేదు గియ్యం లేదు.. ఏదో లైట్ ఫోకస్ పడి ఉంటుందిలే.. అంటూ తనను కూల్ చేయడానికి ప్రయత్నించారు కానీ.. అరియానా వినే టైప్ కాదు కదా. అది దెయ్యమే నేను చూశా.. అంటూ అరిచి గోల చేసింది.

అసలు.. బిగ్ బాస్ హౌస్ లోకి దెయ్యం రావడం ఏంటి? అనేదే ప్రస్తుతం ప్రేక్షకులను తొలుస్తున్న ప్రశ్న. దీనికి సంబంధించిన ఎపిసోడ్ బుధవారం ప్రసారం కానుంది. అప్పుడు కానీ.. అసలు నిజం తెలియదు. అసలు అది దెయ్యమా? లేక ఎవరైనా అలా వేషం వేసుకొని వచ్చారా? ఏంటి సంగతి అనేది అప్పుడు బయటపడుతుంది.

ghost in bigg boss house
ghost in bigg boss house

ఒకవేళ.. నోయల్ మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడేమో? అందుకే.. అలా దెయ్యం వేషం వేసుకొని వచ్చి అందరినీ భయపెడుతున్నాడేమో అని ప్రేక్షకులు భావిస్తున్నా… అసలు.. అది నోయల్ పనా? లేక ఏంటి? అనేది తెలియాలంటే బుధవారం ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాక ఆగాల్సిందే.