కొణిదెల కోడలిని ఫాలో అవుతున్న ఘట్టమనేని కోడలు.. ఆ విషయంలో భర్తలకు ఫుల్ సపోర్ట్?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి వారి భార్యల సపోర్ట్ ఫుల్ గా లభిస్తుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు నటించిన సినిమాలను ప్రమోట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మెగా కోడలు ఉపాసన రామ్ చరణ్ సినిమాలకు సంబంధించి ఎప్పుడు ప్రమోషన్స్ చేస్తూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా విడుదలైన నేపథ్యంలో ఉపాసన ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్లి అభిమానుల మధ్య సినిమా చూసి ఎంతో రచ్చ చేశారు. అదేవిధంగా రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ భారీ ప్రమోషన్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఉపాసనని మహేష్ బాబు భార్య నమ్రత అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సినిమాలకు సంబంధించి ప్రతి విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు నమ్రత ఎప్పుడూ కూడా అభిమానుల మధ్య కూర్చుని సినిమాని వీక్షించింది లేదు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా నమ్రత ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమానుల మధ్య కూర్చొని చూశారు.

అదేవిధంగా ప్రతి థియేటర్ దగ్గరికి వెళ్తూ సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకుందో తెలుసుకుంటున్నారు ఇలా సినిమా ప్రచారం పనుల్ని నమ్రత భుజాన వేసుకోంది. ఇది నిజంగా నమ్రతకి కొత్త అనుభవం అని చెప్పాలి. ఇలా తన భర్తలో సినిమాలకు వీరు ప్రమోట్ చేస్తూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు.అయితే నమృత విషయంలో మాత్రం మహేష్ బాబు నటించిన సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాలు ఈ విధంగా హైలెట్ చేయడం కోసం నమ్రత ప్రయత్నాలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.