గెటప్ శ్రీనులో ఈ టాలెంట్ కూడానా?.. ఎంతైనా మెగా అభిమాని కదా!

Getup srinu sketch Chiarnjeevi in Acharya

జబర్దస్త్ షోలో ఉన్న వారిలో దాదాపు అందరూ కూడా మెగా అభిమానులే. పవన్ కళ్యాణ్, చిరంజీవి అంటే ఇష్టపడే వాళ్లే ఎక్కువ మంది. అయితే నాగబాబు జడ్జ్‌గా ఉండటం మూలానా అలా చెప్పుకొచ్చారో లేదా నిజంగానే మెగా అభిమానులో అనే అనుమానాన్ని ఆ మధ్య నెటిజన్లు వ్యక్తం చేసేవారు. కానీ వారు చెప్పే మాటలు, బయట ఇంటర్వ్యూల్లో మాట్లాడే మాటలు, తమ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో శ్రీను, సుధీర్, రాం ప్రసాద్ చెప్పిన మాటల్లో మాత్రం నిజమైనఅభిమానం కనిపించేది.

Getup srinu sketch Chiarnjeevi in Acharya

ముఖ్యంగా గెటప్ శ్రీనుకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఒక్కసారైనా కలవాలని ఎంతో అనుకునేవాడట. కానీ చిరంజీవే గెటప్ శ్రీను గుర్తు పట్టి పిలిచి మరీ ప్రశంసించాడట. స్కిట్స్ బాగుంటాయి.. గెటప్స్ బాగుంటాయని కితాబిచ్చాడట. అలా చిరు పరిచయం గురించి శ్రీను ఎంతో గొప్పగా చెబుతుంటాడు. అయితే తాజాగా గెటప్ శ్రీను తనలోని మరో కోణాన్ని ప్రతిభను అందరికీ పరిచయం చేశాడు.

మొన్న విడుదలైన ఆచార్య టీజర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో మాస్‌కు కిక్కిచ్చే షాట్స్ ఎన్నో ఉన్నాయి. అందులో ఓ షాట్‌ను తీసుకుని గెటప్ శ్రీను డ్రాయింగ్ వేశాడు. పెన్సిల్‌తొ గెటప్ శ్రీను వేసిన ఆ స్కెచ్ మెగా అభిమానాన్ని చాటి చెప్పింది. ప్రస్తుతం శ్రీను గీసిన ఆ బొమ్మ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. చిరంజీవితో గెటప్ శ్రీను ఖైదీ నంబర్ 150లో నటించిన సంగతి తెలిసిందే.