ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా జబర్దస్త్ గురించి చర్చ జరుగుతుంది. జబర్దస్త్ గురించి కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో తీవ్ర వివాదం నెలకొంది. ఈ క్రమంలో పలువురు జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు మరికొంతమంది ఇండస్ట్రీకి చెందినవారు కిర్రాక్ ఆర్పిని తప్పుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వివాదం రోజు రోజుకి పెరుగుతోంది తప్ప సర్డుమనగడం లేదు. ఇటీవల జబర్దస్త్ డైరక్టర్ ఏడు కొండలు కూడా ఈ వివాదంపై స్పందించాడు. ఈ క్రమంలో ఆయన సుధీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇక జబర్దస్త్ యాంకర్ రష్మి కూడా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యింది. అయితే రష్మి సుధీర్ ని ప్రేమిస్తున్నట్టు, వారి మధ్య ప్రేమ బంధం ఉందని చాలా మంది ప్రేక్షకులు నమ్ముతున్నారు. అయితే వారు మాత్రం మేమిద్దరమూ మంచి స్నేహితులం అని చెబుతున్నారు. ఈ క్రమంలో చాలామందికి వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ జబర్దస్త్ స్టేజ్ మీద చాలాసార్లు పెళ్లి చేసుకున్నారు. సుధీర్, రష్మీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసినవారు నిజంగానే రష్మీ సుధీర్ లవర్స్ అని త్వరలో పెళ్లికూడా చేసుకుంటారేమో అని భావిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు వీరి పెళ్లి వార్త కూడా సోషల్ మీడియాలో నానుతూనే ఉంటుంది
అయితే ఇటీవల గెటప్ శ్రీను ఈ విషయంపై స్పందించాడు.
తాజాగా ఒక చాట్ సెషన్ నిర్వహించిన గెటప్ శీనుకి సుధీర్, రష్మీ పెళ్లి గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ క్రమంలో సుధీర్ రష్మీ పెళ్లి గురించి ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు గెటప్ శ్రీను సమాధానం చెబుతూ.. వారిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే వారు పెళ్లి చేసుకోరు. ఆన్ స్క్రీన్ మీద వారి మధ్య ఉన్న రిలేషన్ కేవలం ప్రేక్షకులను అలరించడానికి మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. షూటింగ్ అయిపోయిన తర్వాత సుధీర్ ది వేరే లోకం, రష్మీ ది వేరే లోకం . వారిద్దరూ కేవలం ప్రేక్షకులను అలరించడానికి మాత్రమే అలా చేస్తున్నారు. ఆన్ స్క్రీన్ మీద వారిద్దరూ లవర్స్ లా కనిపిస్తారు. కాని నిజంగా వారిద్దరూ లవర్స్ కాదు అంటూ శ్రీను చెప్పుకొచ్చాడు.