Get up Sreenu: ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి మాయమైన గెటప్ శ్రీను…. భారమంతా వారిదే!

Get up Sreenu: ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది స్టార్స్ గా గుర్తింపు పొందారు. అటువంటి వారిలో సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురు శుక్రవారం రోజు ఈ టీవీ లో ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఈ ముగ్గురు కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు. సుడిగాలి సుధీర్ టీమ్ లో ఈ ముగ్గురు చేస్తేనే కామెడీ స్కిట్ వర్కౌట్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో శీను జబర్దస్త్ లో అప్పుడప్పుడు కనిపించటం లేదు.

జబర్దస్త్ వల్ల మంచి గుర్తింపు పొందిన వీరు ముగ్గురు సినిమాలలో కూడా మంచి ఛాన్సులు కొట్టేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మాత్రమే కాకుండా హీరోలుగా కూడా ఛాన్సులు వస్తున్నాయి.ఈమధ్య గెటప్ శీను సినిమా అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అప్పుడు అప్పుడు జబర్దస్త్ లో కనిపించకుండా పోతున్నాడు. దీంతో సుదీర్, రాంప్రసాద్ ఇద్దరే స్కిట్ సక్సెస్ అవ్వటానికి కష్టపడుతున్నారు.

వచ్చే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు.ఆ ప్రోమో లో కూడా శీను కనిపించటం లేదు. సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంతో జబర్దస్త్ లో అప్పుడప్పుడు కనిపించటం లేదు. శీను ప్రస్తుతం రాజు యాదవ్ అనే సినిమాతో పాటు మరొక సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. అంతే కాకుండా సైడ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో చేస్తున్నాడు. మొత్తానికి బుల్లి తెర మీదే కాకుండా బిగ్ స్క్రీన్ మీద కూడా శీను సందడి చేస్తున్నాడు.