త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం… లిప్ లాక్ ఫోటోతో క్లారిటీ ఇచ్చిన నరేష్!

గత కొంతకాలంగా నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తూ ఉండడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.ఇక వీరి గురించి ఇలాంటి వార్తలు రావడంతో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి సీన్లోకి ఎంటర్ అయ్యి అప్పట్లో పెద్ద ఎత్తున వివాదాన్ని సృష్టించారు. ఇలా నరేష్ పవిత్ర లోకేష్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇకపోతే నరేష్ పవిత్ర త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నరేష్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా వీరిద్దరూ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అంతేకాకుండా కేక్ కటింగ్ అనంతరం ఒకరికొకరు లిప్ లాక్ పెట్టుకున్నటువంటి ఫోటోని కూడా షేర్ చేసి త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని అందుకు మీ ఆశీర్వాదం కూడా కావాలని ఈయన వీరీ పెళ్లి గురించి తెలియజేశారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

నటుడు నరేష్ ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకొని తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చారు. ఇక ఈయన నాలుగో సారి నటి పవిత్ర లోకేష్ తో పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. పవిత్ర లోకేష్ కూడా ఇదివరకే వివాహం చేసుకొని తన భర్తకు విడాకులు ఇచ్చారు.ఇక వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించిన ప్రేమ చిగురించిందని దీంతో వీరిద్దరూ సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి నరేష్ నాలుగో పెళ్లిపై ఈయన మాజీ భార్యల స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.