టాలీవుడ్ క్రేజీయెస్ట్ కాంబినేషన్ లలో ఒకటైన సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల నుంచి రాబోతున్న కొత్త చిత్రం అందులోని హ్యాట్రిక్ చిత్రమే “గుంటూరు కారం”. దీని కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి ఎప్పుడు నుంచో ఎదురు చూస్తూ వస్తున్న ఓడతి సాంగ్ ని అయితే ఫైనల్ గా మేకర్స్ ఇప్పుడు వదిలేసారు.
మరి దం మసాలా అంటూ స్టార్ట్ చేసిన ఈ సాంగ్ ఇన్స్టంట్ గా అందరి అంచనాలు అందుకుందా అంటే లేదు అనే చెప్పాలి. ఎందుకంటే థమన్ కొంతవరకు ఓకే అనిపించాడు కానీ తనకి మహేష్ కి అలాగే తనకి త్రివిక్రమ్ కి ఉన్న ట్రాక్ రికార్డుతో చూస్తే మాత్రం ఈ సాంగ్ అంచనాలు అందుకోలేదు.
అంతే కాకుండా ఈ సాంగ్ లో మహేష్ బాబు పై కొన్ని లిరిక్స్ తప్ప మిగతా సాంగ్ అంతా చప్పగానే ఉంది. ఇంకా మరో ప్లస్ ఏంటంటే అది మహేష్ బాబు అని చెప్పొచ్చు. త్రివిక్రమ్ పూనకం వచ్చినట్టుగా మహేష్ బాబును ఈ సినిమాలో చూపిస్తున్నాడు అని ఈ సాంగ్ చూస్తే అర్ధం అయిపోతుంది.
కాగా ఈ చిత్రం సాంగ్ కోసం ఫ్యాన్స్ కూడా ఇదే తరహాలో మాట్లాడుకుంటున్నారు. కొంతమందికి నచ్చినప్పటికీ కొంతమంది అనుకున్న రేంజ్ లో లేదు అని అనేస్తున్నారు. దీనితో ఈ సాంగ్ కి కంప్లీట్ గా పాజిటివ్ టాక్ రాలేదు అలాగని నెగిటివ్ కూడా రాలేదు. దీనితో ఒక జస్ట్ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన డల్ ఫస్ట్ సింగిల్ గా మిగిలిపోయింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరిలు నటించగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కాబోతుంది.