Genelia : సత్యం సినిమా తో హీరోయిన్ గా టాలీవుడ్లో అడుగు పెట్టిన జెనిలియా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన బొమ్మరిల్లు సినిమాతో హ హ హాసిని గా తెలుగు ప్రేక్షకులకు స్థిరపడిపోయింది. చివరగా రానాతో నటించినా నా ఇష్టం సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. హిందీ లో రితేష్ దేశముఖ్ తో మొదటి సినిమా చేసి తర్వాత ఆ హీరోయిన్ నే 2012 లో పెళ్లిచేసుకుని స్థిరపడిపోయింది.
ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియా లో తన భర్త రితేష్ తో కలిసి సరదా వీడియోలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటోంది. ఇక హిందీ టీవీ లో ఒక కార్యక్రమం కూడా తన భర్త తో కలిసి చేస్తోంది. ఇక ఇటీవలే జెనిలియా తిరిగి సినిమాల్లో నటించనుందనే వార్త వినిపించింది.
ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు అయినా గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటీ ని వారహి బ్యానర్ పై సాయి కొర్రపాటి పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా లో ఒక కీలక పాత్ర కోసం జెనిలియా ను ఎంపిక చేసుకుంది చిత్ర యూనిట్. అలా దక్షిణాది సినిమా లో మళ్ళీ మెరవనుంది జెనిలియా.
అయితే ఇపుడు చర్చంతా ఈ సినిమా కు జెనిలియా తీసుకుంటున్న పారితోషకం గురించే హీరోయిన్ గా బాగా ఫామ్ లో ఉన్నపుడు జెనిలియా సినిమా కు 70లక్షలు తీసుకుంది. అయితే ఇపుడు రీ ఎంట్రీ కి ఏకంగా 3 కోట్లు డిమాండ్ చేస్తోందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే సినిమాలో ఆమె పాత్ర కీలకం కావడం వల్ల ఆ పాత్రకు జెనిలియానే సరిపోతుందని చిత్ర యూనిట్ భావించడం వల్ల ఆమె డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారట. చూడాలి మరీ ఇందులో ఎంత నిజముందో.ఇక ఈ సినిమా లో కిరిటీ సరసన శ్రీలీలా హీరోయిన్ గా నటించనుంది. కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రవిచంద్ర ఒక కీలక పాత్రలో నటించనున్నారు. భారీ తారాగణంతో, టెక్నీషియన్స్ తో రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రం కిరిటీకి విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి.