టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్‌గా గీతా మాధురికి ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. తనకంటూ ఉన్న స్పెషల్ వాయిస్ ఆమెకు గుర్తింపును తీసుకొచ్చింది. అయితే బిగ్ బాస్ షో మాత్రం ఆమెకు ఉన్న క్రేజును, స్థాయిని వంద రెట్లు పెంచేసింది. బిగ్ బాస్ షో సెకండ్ సీజన్ విన్నర్ అయ్యే అర్హత ఉన్న కంటెస్టెంట్‌గా అందరి మనసులను దోచేసింది. అయితే చివరకు మాత్రం కౌశల్ విన్నర్ అవ్వడంతో గీతా మాధురి రన్నర్‌గా నిలిచింది.
అయితే సెకండ్ సీజన్‌లో గీతా మాధురికి జరిగిన అనుభవాలతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తుంటుంది. ఆ మధ్య వితికా షెరు తన అనుభవాలు, బిగ్ బాస్ షో వల్ల వచ్చిన ట్రోలింగ్, డిప్రెషన్, బాధల గురించి ఓ వీడియోను షేర్ చేసింది. ఫీమేల్ కంటెస్టెంట్లు అందరూ కూడా ఇలా వీడియోలు చేయాలని కోరింది. తాను కూడా అలాంటివి ఎదుర్కొన్నానని చెబుతూ.. తప్పకుండా వీడియో చేస్తానని గీతా మాధురి చెప్పింది.
బిగ్ బాస్ నాల్గో సీజన్‌కు సంబంధించి గీతా మాధురి నిత్యం అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. షో ఎలా జరిగింది?తాను ఎవరెవరికి సపోర్ట్ చేస్తోందో చెబుతూ ఓట్లు వేయమని అడుగుతుంది. ఇక తాజాగా గీతా మాధురి రెండేళ్ల క్రితం బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన ఫోటోను షేర్ చేసింది. అందులో గీతా మాధురి చాలా సన్నగా ఉంది. ఒకవేళ ఎవరైనా వెయిట్ లాస్ అయి సన్నగా అవ్వాలంటే బిగ్ బాస్ షోలోకి వెళ్లాల్సిందే అని కౌంటర్ వేసింది. అంటే అక్కడ ఫుడ్ సరిగా పెట్టరని సెటైర్ వేసిందో.. లేదా.. అక్కడ క్రమశిక్షణగా డైట్ మెయింటైన్ చేయాల్సి వస్తుందని చెప్పిందో ఆమెకే తెలియాలి.