Gali JanardhanReddy Son: గాలి జనార్దన్ కొడుకు హీరోగా ద్విభాషా చిత్రం…ఆరోజే లాంఛనంగా ప్రారంభం!

Gali JanardhanReddy Son: తెలుగు సినిమా పరిశ్రమలో హీరోల వారసులు, రాజకీయ నాయకుల వారసులు, ప్రముఖ వ్యాపారవేత్తల కొడుకులను హీరోలుగా పరిచయం చేస్తూ సినిమాలు రావడం మాములే ఇటీవలే గల్లా జయదేవ్ కొడుకు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీశారు.ఇపుడు ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటీ హీరోగా పరిచయం అవుతున్నాడు.

కొత్త హీరోలను పరిచయం చేయడంలో వారహి చలన చిత్రం బ్యానర్ ముందుంటుంది. ఇపుడు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటీని కూడా తెలుగులో హీరోగా పరిచయం. చేయబోతున్నారు. రాధాకృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. కన్నడ, తెలుగు భాషల్లో సినిమా నిర్మించబోతున్నారు. ఇందుకోసం కిరిటీ నటన, డాన్సు, ఫైట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. సినిమా కోసం లావు తగ్గి ఫిట్ గా తయారయ్యాడు. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్, యాక్టర్స్ ను రంగంలోకి దించుతున్నారు. మార్చి 4 న లాంఛనంగా ప్రారంభమవుతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఇతర ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం ప్రకటించనున్నట్లుఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాల పై ఎంతో మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న రాజకీయ వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది.