ఫన్నీ కామెడీ పండిస్తున్న అనుదీప్‌!

పిట్టగోడ అనే ప్లాప్‌ మూవీతో దర్శకుడిగా ఇండస్టీక్రి పరిచయమైన అనుదీప్‌ .. ఆ తర్వాత ’జాతిరత్నాలు’ సినిమాతో ఓవర్‌ నైట్‌ క్రేజీ డైరెక్టర్‌ గా మారిపోయారు. ఒక్క సారిగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్టీ అయ్యారు. ఇదే జోష్‌ లో కోలీవుడ్‌ హీరో శివ కార్తికేయన్‌ తో ’ప్రిన్స్‌’ అనే ద్విభాషా చిత్రం చేయగా అది బోల్తా కొట్టింది. అయితే దర్శకుడిగా ఆయన తనలోని మరో కొత్త కోణాన్ని బయటపెట్టేందుకు రెడీ అయిపోయారు.

నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తన ఫన్నీ కామెడీ మాటలతో, ఇనోసెంట్‌ ఎక్స్‌ ప్రెషన్‌ తో పాపులర్‌ అయ్యారు అనుదీప్‌. ముఖ్యంగా ఇంటర్వ్యూల సమయంలో యాంకర్ల ముఖాల్లో ఓ క్వశ్చన్‌ మార్క్‌ రెయిజ్‌ చేయడం, షార్ట్‌ ఆన్సర్స్‌ చెప్పడం.. ఇలా రకారకాలుగా సోషల్‌ విూడియాలో బాగా హైలైట్‌ అయ్యారు. మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు.

అయితే ఇప్పుడాయన నటుడిగా మారారు. ఎన్టీఆర్‌ బావమరిది నటిస్తున్న నార్నె నితిన్‌ కొత్త సినిమా మ్యాడ్‌ లో ఓ పాత్ర పోషించారు. కాలేజ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌ తాజాగా రిలీజై ఆకట్టుకుంది. ఇందులో అనుదీప్‌ కాలేజు కుర్రాళ్లతో పాటు కనిపించి ఆకట్టుకున్నారు. అనుదీప్‌ కామెడీ టైమింగ్‌ ఓ రేంజ్‌ లో ఉన్నట్టు అర్థమవుతోంది. అనుదీప్‌ తన మార్క్‌ కామెడీతో బాగానే నటించారని అనిపిస్తోంది. అసలే అనుదీప్‌ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు అన్న ప్రచారం కూడా ఉంది.

ఈ చిత్రంలో అనుదీప్‌ కామెడీ బాగా పండితే.. తాను డైరెక్ట్‌ చేసే సినిమాలతో పాటు ఇతర చిత్రాల్లోనూ కనిపించే అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఆయన ఏ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయలేదు. ఇక మ్యాడ్‌ సినిమా విషయానికొస్తే.. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో నార్నె నితిన్‌, రామ్‌ నితిన్‌, సంతోష్‌ శోభన్‌ తమ్ముడు సంగీత్‌ శోభన్‌, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సితారా, ఫ్యార్చూన్‌ ఫోర్‌ సంస్థలు సంయుక్తంగా కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ కథ మొత్తం కాలేజ్‌ చుట్టూనే తిరుగుతుందని అర్థమైంది. కాలేజీ గ్యాంగులు, సీనియర్ల ర్యాగింగ్‌, ప్రేమలు, కొట్లాటలు అన్నింటినీ తాజా ట్రైలర్‌ లో చూపించారు.