అల్లు అర్జున్ కుమార్తెతో సరదాలు.. పుట్టిన రోజు సందర్భంగా ఫన్నీ అల్లరి!

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌, నేషనల్‌ అవార్డు విన్నర్‌ అల్లు అర్జున్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అయితే బన్నీ సోషల్‌ మీడియాలో ఎంత ఫేమస్సో .. ఆయన గారాల పట్టి అల్లు అర్హకూడా అంతే ఫేమస్‌. ఇక నెట్టింట తండ్రీ కూతురు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను బన్నీ భార్య అల్లు స్నేహ రెడ్డితో పాటు.. అల్లు అర్జున్‌ అప్పుడప్పుడు తరచూ సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటుంటారు.

ఇక అవి చూసిన బన్నీ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్హ మంగళవారం తన 7వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన గారాల పట్టికి బన్నీ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు అర్హకు సంబంధించిన ఫొటోలతో పాటు ఒక జిఫ్‌ వీడియోను అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కు ‘నా సంతోషాల సమూహం’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.