పాన్ ఇండియా సినిమా వన్ అండ్ ఒన్ల్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ తన రేంజ్ కి తగ్గ హిట్ ఒకటి అందుకుంటే ఎలా ఉంటుందో మళ్ళీ తన లేటెస్ట్ చిత్రం “సలార్” తో చూపించాడు. కాగా ఈ చిత్రంతో సుమారు 700 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన ప్రభాస్ మరోసారి దుమ్ము లేపగా అప్పుడు బాహుబలి తో ఎంతమందికి రీచ్ అయ్యాడో ఇప్పుడు మళ్ళీ సలార్ తో అదే విధంగా రీచ్ అవుతున్నాడు అని చెప్పాలి.
కాగా ఈ చిత్రం రీసెంట్ గానే ఓటిటిలో కూడా వచ్చింది. ప్రముఖ ప్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ లో సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియెన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా సలార్ ని చూసిన ఫారిన్ ఆడియెన్స్ ప్రభాస్ కోసం మాట్లాడ్డం స్టార్ట్ చేశారు.
గతంలో బాహుబలి చూసిన వారు కూడా సలార్ లో ఉన్నది ప్రభాస్ అని గుర్తు పట్టి సలార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనితో ఓటిటి లో ఈ రేంజ్ స్పందన వస్తుండడంతో ఫ్యాన్స్ చిత్ర యూనిట్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇక్కడ సలార్ సెట్ చేసిన స్టాండర్డ్స్ ఏమిటంటే ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో నెట్ ఫ్లిక్స్ నుంచి ఓ ఇండియా సినిమాకి ఇలా గుర్తింపు రావడం ఇదే మొదటి సారి.
అదేంటి లాస్ట్ టైం RRR కి కూడా వచ్చిందిగా అంటే.. అక్కడ RRR సినిమా హిందీ వెర్షన్ లో వచ్చాక భారీ ఫేమ్ వచ్చింది. కానీ ఇక్కడ సలార్ కి హిందీలో రాకుండానే ఇంత త్వరగా సెన్సేషన్ అయ్యిపోయింది. దీనితో ఇలా ఓ ఇండియన్ సినిమాకి జరగడం మాత్రం ఇదే మొదటి సారి.