RRR Movie: జీవితంలో ఫస్ట్ టైం మాటలు రావడం లేదు : రామ్‌గోపాల్‌వర్మ

RRR Movie: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌లు హీరోలుగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, దుమ్ము రేపుతూ తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. తొలివారం రోజుల్లోనే దాదాపు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్‌ చేస్తూ విజయ దుంధుబి రేపింది. ఇక ఈ సినిమాను చూసిన మామూలు ప్రేక్షకులే కాదు, సెలబ్రెటీలు, ప్రముఖులు సైతం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై ఇప్పటివరకూ దాదాపు పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడూ కాంట్రవర్శియల్ సినిమాలు తీస్తూ, కామెంట్స్, ట్వీట్స్ చేస్తూ పలు వివాదాలకు కారణమయ్యే రామ్‌గోపాల్‌వర్మ తాజాగా ఈ సినిమాను చూసి తన స్టైల్‌లో రివ్యూను తెలియజేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూశాక తనకు మాటలకు మొదటి సారి తనకు మాటలు కరువయ్యాయన్న వర్మ, ఫేమ్, స్టేటస్ అన్నీ పక్కన పెట్టి ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశాన్నీ ఎంజాయ్ చేశానని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా ట్రైలర్ చూసినపుడు బాగుంటుందని మాత్రమో భావించానని, కానీ సినిమా చూశాక ఇదొక అద్భుతమైన సినిమా అని అర్థమైనట్టు ఆయన తెలిపారు.

జీవితంలో ఫస్ట్ టైం ఈ సినిమాను పొగడడానికి మాటలు రావడం లేదన్న ఆర్జీవీ, తారక్, చరణ్ పాత్రలు దర్శకుడు చూపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. గత 30ఏళ్లలో ఏ చిత్రాన్నీ తాను ఇంత ఎంజాయ్ చేయలేదని, నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం అంటూ రాజమౌళి ప్రశంసలతో ముంచెత్తారు రామ్‌గోపాల్‌వర్మ. ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి, కామెంట్స్ చేసే వర్మ ఈ సారి, అది కూడా ఇంత పాజిటివ్‌గా రివ్యూ ఇవ్వడంపై ప్రస్తుతం అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.