ఏదో అనుకోకుండా ఆమె తెలుగునాట తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చేసుకుంది. ఆ హీరోదీ అదే పరిస్థితి. ఇద్దరూ ఒకే సినిమాతో నటీనటులుగా తెరంగేట్రం చేశారు. వీరిద్దరికీ మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. కలిసి సినిమాలు చేశారు.
ఇద్దరి మధ్యా ఎఫైర్ నడుస్తోందంటూ గాసిప్స్ కూడా వచ్చాయి. తూచ్.. అలాంటిదేమీ లేదని, ఇరువురూ ఖండించారు. ఇంతలో అనూహ్యంగా ఆమె సినిమా నిర్మాణం వైపుకు కూడా మళ్ళింది.
అలా ఆమె నిర్మించిన ఓ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఆమెతో డబ్బులు ఖర్చు పెట్టించింది సదరు హీరోయేనట. అయినాగానీ, ఆ హీరోగార్ని ఆమె ఏమీ అనడంలేదట.
ఫ్లాప్ హీరో, ఫ్లాప్ హీరోయిన్.. చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. జస్ట్ స్నేహం మాత్రమే సుమీ.. అంటున్నారట ఆ ఇద్దరూ.!