‘బెదురులంక’ బెదరగొట్టేసిందంటూ తొలి రోజు రివ్యూలొచ్చాయ్. ఆ తొలిరోజు రివ్యూలతో కొంత ఆందోళనకు గురయ్యాడు హీరో కార్తికేయ. అసలే ఈ మధ్య కార్తికేయకు చేసిందేదీ కలిసి రావడం లేదు.
‘బెదురులంక’ సినిమా టైమ్‌లో చాలా ఒత్తిడికి గురయ్యాడనీ ఆయన సన్నిహితుల ద్వారా అందిన గుస గుస. ఆ ఒత్తిడి, భయంతోనే, ‘బెదరురులంక’ నిర్మాణంలో వుండగా తన వద్దకు ఎన్ని కథలొచ్చినా జడ్జ్ చేయలేక పక్కన పెట్టాడు.
ఎప్పుడైతే బెదురులంక వసూళ్లు పుంజుకున్నాయో మన హీరోలో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దాంతో, ఇంతకు ముందు విని పక్కన పెట్టిన కథల బూజు దులపడం మొదలు పెట్టాడు.
బ్యాక్ టు బ్యాక్ కార్తికేయ నుంచి పలు ప్రాజెక్టులు అనౌన్స్ కాబోతున్నాయట. అనౌన్స్ చేయడమే కాదు, ఇదే మూడ్‌లో ఇదే ఫ్లోలో వీలైనంత త్వరగా ఆయా ప్రాజెక్టులు పూర్తి చేసి వదలాలనుకుంటున్నాడట కార్తికేయ.
అంతేనా.! నిర్మాతల యాంగిల్ కూడా మారిపోయిందట కార్తికేయ మీద. ఫ్లాప్ టాక్ తెచ్చుకుని హిట్టు కొట్టడంతో, కార్తికేయ మీద ఓ మోస్తరు.. ఆ పైన. కాదు కాదు.. అంతకు మించి బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారట.
‘బెదురులంక’ టైటిల్ మొదట్లో కార్తికేయను బెదరగొట్టినా.. తర్వాత భలే కలిసొచ్చేలానే చేసిందిలే.!