కార్తికేయ మూవీ ‘భజే వాయువేగం”

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం కార్తికేయ డెబ్యూ డైరెక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్న మూవీ కార్తికేయ ఎనిమిదవ సినిమాగా రానుంది. సంఘటనల సుడిగుండంతో జీవితం తలకిందులుగా మారినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండండి.. అంటూ క్యాప్షన్‌ ఇచ్చి క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్‌. ముందుగా ప్రకటించిన ప్రకారం టాలీవుడ్‌ స్టార్‌ హీరో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను లాంఛ్‌ చేశారు.

ఈ చిత్రానికి ‘భజే వాయు వేగం’ టైటిల్‌ను ఖరారు చేశారు. అతడు పార్క్‌ నుండి తన అదృష్టాన్ని ఛేజ్‌ చేస్తూ వస్తున్నాడు. మిమ్మల్ని విూ సీట్ల అంచున ఉంచే రేసీ థ్రిల్లర్‌గా సినిమా ఉండబోతుందంటూ ట్వీట్‌ చేశారు మేకర్స్‌. కార్తికేయ బ్యాట్‌ పెట్టుకొని పరుగులు పెడుతున్న స్టిల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కారు, డబ్బును చూడొచ్చు. మొత్తానికి ఏదో ఒక ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌తో ఈ మూవీ ఉండబోతుందని అర్థమవుతోంది. మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నాడు కార్తికేయ.

యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్‌ బ్యానర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ యూనిక్‌ రోల్‌లో కనిపించబోతున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌. సాలిడ్‌ కంటెంట్‌తో వస్తోన్న ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీలో మలయాళ భామ ఐశ్వర్యవిూనన్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోండగా.. ‘హ్యాపీ డేస్‌’ ఫేం రాహుల్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఈ మూవీకి రాధన్‌ సంగీతం అందిస్తుండగా.. కపిల్‌ కుమార్‌ బీజీఎం సమకూరుస్తున్నాడు. ఈ మూవీకి ఆర్‌డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫర్‌ కాగా.. పీ అజయ్‌ కుమార్‌ రాజు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.