‘భజే వాయు వేగం’ మోషన్‌ పోస్టర్ విడుదల!

గతేడాది ‘బెదురులంక’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు టాలీవుడ్‌ నటుడు కార్తికేయ. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా అనంతరం కార్తికేయ యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘భజే వాయు వేగం’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ నుంచి మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. స్పీడుగా దూసుకుపోయే కారు, డిక్కీలో డబ్బుల మూటలతో ఫుల్‌ యాక్షన్‌ ప్యాక్‌డ్‌గా సాగింది. ఇక ఈ సినిమాలో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్‌ కథానాయికగా నటిస్తోంది. రాహుల్‌ టైసన్‌, తనికెళ్ల భరణి, రవిశంకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రథన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్‌ చేయనున్నారు మేకర్స్‌.