ఇండస్ట్రీ టాక్ : ఎన్టీఆర్ కి ఫైనల్ గా ఈమెనే ఫైనలైజ్ చేసారా?

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న మరో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పుడు గ్లోబల్ గా ఎన్టీఆర్ భారీ క్రేజ్ తో దూసుకెళ్తున్నాడు. ఇక తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ 30 సినిమాకి కూడా గ్లోబల్ వైడ్ భారీ ఎత్తున సెన్సేషన్ ని తాను రేపుతున్నాడు.

ఇక కొరటాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ అంటూ మొన్ననే కొత్త సంవత్సరం సందర్భంగా కన్ఫర్మ్ చేసేసారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మొదటి నుంచి మాత్రం ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాకపోవడం అంతకంతకూ ఆసక్తిగా మారింది.

మొదట్లో మేకర్స్ కొంతమందిని అప్రోచ్ కావడం వాళ్ళు నో చెప్పడమో లేక డేట్స్ సెట్ కాకపోవడంతో ఎన్టీఆర్ సినిమాకి హీరోయిన్ లేకుండా పోయింది చాలా నెలలు. కానీ ఫైనల్ గా చిత్ర యూనిట్ ఓ హీరోయిన్ ని ఫైనల్ చేసినట్టుగా ఇపుడు సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఆ హీరోయిన్ బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూరే అని తెలుస్తుంది.

కొన్నాళ్ల కితం ఈమెపై కొన్ని రూమర్స్ వినిపించగా ఎట్టకేలకి ఇవి నిజం కాబోతున్నట్టుగా సినీ వర్గాల్లో గట్టి టాక్ ఇప్పుడు మొదలైంది. అలాగే అతి తొందరలోనే దీనిపై కూడా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తోంది. ఇక ఈ మాస్ అండ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.