బాక్సాఫీస్ : ఫైనల్ గా వరల్డ్ వైడ్ ఈ రికార్డ్ మార్క్ టచ్ చేసిన “సలార్”

ఈ ఏడాదిలో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వచ్చిన పలు రికార్డు హిట్ చిత్రాల్లో అయితే ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్ ఏక్షన్ డ్రామా “సలార్ సీజ్ ఫైర్” కూడా ఒకటి. కాగా ఈ సినిమా అనుకున్న అంచనాలు తెలుగు సహా ఓవర్సీస్ మార్కెట్ లో అందుకొని రికార్డు వసూళ్లు అందుకుంది.

అయితే ఈ సినిమా కేవలం మొదటి మూడు రోజుల్లోనే 400 కోట్లు కొల్లగొట్టింది. దీనితో నాలుగో రోజుకే 500 కోట్లు కొట్టేస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మార్క్ అందుకోడానికి సలార్ కి ఇంకో 5 రోజుల సమయాన్ని తీసుకోవడం ఇక్కడ గమనార్హం. దీనితో సలార్ వసూళ్ల విషయంలో వస్తున్నా ట్రోల్స్ కి మేకర్స్ వెనక్కి వెళ్లి రియల్ వసూళ్లు ఇప్పుడు వేసారా అనేది చాలా మందికి ప్రశ్నగా మారింది.

అయితే ఇవి పక్కన పెడితే హీరో ప్రభాస్ మాత్రం మళ్ళీ తన కెరీర్ లో 500 కోట్ల మార్క్ చిత్రాన్ని ఇన్నాళ్ళకి అందుకున్నాడు. తన లాస్ట్ సినిమా బాహుబలి 2 తో 500 కోట్లకి పైగా అందుకున్న ప్రభాస్ చివరి సినిమా ఆదిపురుష్ 450 కోట్ల గ్రాస్ వరకు వెళ్ళింది. కానీ మొత్తానికి అయితే సలార్ తో ప్రభాస్ ఈ సెన్సేషనల్ మార్క్ ని అందుకున్నాడు.

ఇక ముందు వసూళ్లు ఎలా ఉంటాయి అనేది ప్రశ్నగా మారింది. చాలా మంది ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు. కానీ అనుకోని విధంగా వసూళ్లు మెయిన్ గా హిందీ మార్కెట్ లో పెద్దగా లేవు. దీనితో సలార్ 1000 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేయడం అనేది కష్టమే అని చెప్పాలి.