ఫైనల్ గా గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. 

ఏ హీరో అభిమానికి ఉండదు తమ అభిమాన హీరో భారీ హిట్స్ అందుకొని మరిన్ని హైట్స్ అందుకోవాలని. అయితే కొందరి హీరోల అభిమానులకి మాత్రం అవి చాలా దూరంగానే ఉంటూ ఉంటాయి. ఒక టైం లో పీక్స్ లోకి వెళ్లిన హీరో మళ్ళీ తన రేంజ్ హిట్ అందుకోవడానికి ఎన్నో ఏళ్ల సమయం కావాల్సి వస్తుంది.

ఇప్పుడు అలాంటి మూమెంట్ లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ అండ్ తన ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి. తన కెరీర్ లోనే అత్తో పెద్ద హిట్ అయినటువంటి బాహుబలి 2 తర్వాత నుంచి ప్రభాస్ కెరీర్ లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో ఏది కూడా అనుకున్న రేంజ్ లో హిట్ గా మారలేదు.

దీనితో ప్రభాస్ కి హిట్ ఎపుడు అనేది ఫ్యాన్స్ లో ప్రశ్నగా మారింది. కానీ దానిని ఫైనల్ గా సలార్ సినిమా ఇప్పుడు తీర్చేసింది. అన్నేళ్ల ఆకలితో ఉన్న రెబల్స్ కి అయితే సలార్ మాసివ్ ట్రీట్ ని ఇపుడు అందించింది. దీనితో ఫైనల్ గా ఈ సినిమాతో ప్రభాస్ అయితే ఓ సెన్సేషనల్ కం బ్యాక్ ని అందుకోగా ఫ్యాన్స్ కోరుకుంటున్న అవైటెడ్ బాక్సాఫీస్ హిట్ ని కూడా ఇచ్చేసాడు.

ఇక సలార్ వసూళ్ల హవా ఎక్కడ ఆగుతుంది అనేది మాత్రమే ఇక ఫ్యాన్స్ ఆలోచించాల్సి ఉంటుంది అని చెప్పాలి. కాగా ఈ అవైటెడ్ సినిమాని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా అదే సినిమాల ప్రొడక్షన్ హౌస్ హోంబాలే ఫిల్మ్స్ వారు తమ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.