గాసిప్స్ : మొత్తానికి బన్నీ కథ నితిన్ దగ్గరకి? 

allu-arjun_1

తమ సినిమాలకి యూట్యూబ్ లో హిందీ వెర్షన్ లో భారీ వ్యూస్ చూసి పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన వారిలో అల్లు అర్జున్ కూడా ఒకడు. అయితే అల్లు అర్జున్ ని నార్త్ లో ఉన్నది యూట్యూబ్ క్రేజ్ కాదు థియేటర్స్ కి వచ్చి చూసే క్రేజ్ అని పుష్ప 1 తో తేలిపోయింది. దీనితో అల్లు అర్జున్ సక్సెస్ అయ్యాడు.

కానీ ఇదే యూట్యూబ్ వ్యూస్ క్రేజ్ చూసుకుని కొందరు హీరోలు హిందీలో కూడా సినిమాలు అనౌన్స్ చేశారు కానీ సినిమా రిలీజ్ చేసుకోలేకపోయారు. మరి ఆ హీరోస్ లో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న హీరో నితిన్ కూడా ఒకడు. కాగా నితిన్ సినిమాలకి కూడా నార్త్ ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ఉంటుంది.

దీనితో ఓ మంచి సినిమాతో థియేట్రికల్ ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఇంట్రెస్టింగ్ గా అసలు అల్లు అర్జున్ ని పాన్ ఇండియా సినిమాకి పరిచయం చేయాల్సిన సబ్జెక్టు ఇప్పుడు నితిన్ వద్దకు చేరినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

ఎప్పుడు నుంచో దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబోలో అనుకున్న “ఐకాన్” సినిమా కోసం చాలా మందికే తెలుసు. కానీ ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ తప్పుకున్నాడు. మరి ఈ సినిమానే ఇప్పుడు నితిన్ దగ్గరకి వెళ్లినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి దీనికి కూడా ఇంకా నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందట. దీనితో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా ఆసక్తిగానే మారింది.