టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి సురేఖ వాణి ఒకరు. ఈమె ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే తన భర్త సురేష్ తేజ మరణించిన తర్వాత సురేఖ వాణి సినిమాలకు కాస్త దూరం అయ్యారు. ఇలా సినిమాలకు దూరమైనటువంటి సురేఖవాణి సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సురేఖ వాణి తన కూతురితో కలిసి ఎంతో సందడి చేస్తూ హీరోయిన్ రెంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
ఇకపోతే చాలా రోజుల తర్వాత ఈమె బెల్లంకొండ గణేష్ నటించిన స్వాతి ముత్యం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోనే చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సురేఖవాణి మాట్లాడుతూ తాను సినిమాలకు దూరం కావడానికి గల కారణాలను తెలియజేశారు.అందరూ అనుకున్నట్టు తను సినిమాలకు దూరం కాలేదని తనకు సినిమా అవకాశాలు రాలేదంటూ ఈమె వెల్లడించారు.
ఒకప్పుడు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే తనకు ఈ మధ్యకాలంలో ఒక సినిమా అవకాశం కూడా రాలేదని అలా ఎందుకు జరుగుతుందో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని సురేఖ వాణి వెల్లడించారు. తనకు సినిమా అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని కార్యక్రమంలో వెల్లడించారు. తనకు స్వాతిముత్యం సినిమాలో అద్భుతమైన పాత్రలో నటించే అవకాశం కల్పించినందుకు ఈమె చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపోతే సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా తన కూతురు సుప్రీతను పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే. ఈమె కూడా మంచు లక్ష్మి నటిస్తున్నటువంటి లేచింది మహిళ లోకం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.