Fear: భయపెట్టేందుకు వస్తున్న వేదిక!?

Fear: బాణం, రూలర్‌, శివలింగ, కాంచన 3 సినిమాలతో టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది వేదిక . ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా.. వీటిలో ఒకటి ఫియర్‌. ఈ సినిమాకు లక్కీ లక్ష్మణ్‌ నిర్మాత హరిత గోగినేని కథనందిస్తూ దర్శకత్వం వహిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేయగా.. చీకట్లో ముఖంపై చేతులు పెట్టుకొని భయంగా కనిపిస్తున్న లుక్‌ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచుతోంది.

కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. భయంకరమైన ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ధైర్యంగా మిమ్మల్ని మీరుసిద్దం చేసుకోండి. వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని తెలియజేస్తూ కొత్త లుక్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీని దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఏఆర్‌ అభి నిర్మిస్తుండగా.. సుజాత రెడ్డి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తుండగా.. ఆండ్రీవ్‌ బాబు సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.

మోడీ తర్వాత ఎవరు | Journalist Vasudevan Analysis On BJP | Modi | Pawan Kalyan | Yogi Adityanath | TR