బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ఫాస్ట్ X

హాలీవుడ్ మూవీ సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆ సినిమాలను ఇప్పటికీ చాలా మంది అభిమానులు కనురెప్ప వాల్చకుండా చూస్తారు. అయితే ఈ అద్భుతమైన యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పటికే తొమ్మిది పార్టులుగా విడుదల కాగా.. ఇటీవలే 10వ సిరీస్ ఫాస్ట్ ఎక్స్ కూడా రిలీజా అయింది. ఈ అద్భుతమైన హాలీవుడ్ సినిమా తెలుగులోనూ డబ్ అయి రిలీజ్ అయింది.

బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే కనెక్ట్ అయింది. ఈ సినిమా మొదటి రోజు నుంచే అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమా మొదటి రోజు భారతదేశంలో 12 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను అందుకొని సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు నుంచి మంచి గ్రోత్ నే చూపించింది. నిన్నటికి నిన్న 13.5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

మొత్తం రెండ్రోజుల్లో భారత దేశంలో 25.5 కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టుకొని దుమ్ము లేపింది. స్ట్రైట్ బిగ్ హిందీ మూవీస్ కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లను అందుకోలేకపోయాయి. కష్టపడుతూ ఉండగా నార్మల్ వర్కింగ్ డేస్ లో రిలీజ్ అయి ఫాస్ట్ ఎక్స్ మూవీ ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది. ఈ శని, ఆది వారల్లో బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రం మరింత జోరు చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీస్ లో విన్ డీజిల్ టైరీస్ గిబ్బన్, సంగ్ కాంగ్, క్రిస్ బ్రిడ్జెస్, జోర్డానా బ్రూస్టర్, మైఖేల్ రోడ్రిగ్జ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరో భాగం తీసి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ ను ముగించబోతున్నారు. 11వ భాగాన్ని మరింత పెద్దదిగా మార్చనున్నారు. ఐరన్ మ్యాన్ పాత్రలో కనిపించిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో కనిపించాడు.

ఈ సినిమాకు డాన్ మజేయు, జస్టిన్ లిన్, జాక్ డీన్ కథను అందించగా… డాన్ మజేయు, జస్టిన్ లీన్ స్కీన్ ప్లే రచించారు. బ్రియాన్ టైలర్ సంగీతం అందించగా.. యూనివర్సల్ పిక్చర్స్, ఒరిజినల్ ఫిల్మ్, వన్ రేస్ ఫిల్మ్స్, పర్ఫెక్ట్ స్టార్మ్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. అలాగే ఈ అద్భుతమైన యాక్షన్ సినిమాకు లూయిస్ లెటెరియర్ దర్శకత్వం వహించారు.