నెల తిరక్కుండానే ఓటిటిలో లేటెస్ట్ పాన్ ఇండియా డిజాస్టర్.!

Michael-Movie-Review-and-Rating-jpg

పాన్ ఇండియా మార్కెట్ లో అన్ని సినిమాలు సక్సెస్ అయ్యిపోవాలని లేదు. చాలా సినిమాలు అనౌన్స్ అయ్యి లాస్ట్ కి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాకుండానే కనుమరుగు అయ్యిపోయినవి ఉన్నాయి అలాగే కొన్ని రీజనల్ గా వచ్చి తర్వాత పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి హిట్ అయినవి కూడా ఉన్నాయి.

అయితే మన తెలుగు సినిమా నుంచి ఈ ట్రాక్ బాగుండేసరికి చాలా సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ అయ్యాయి. అలా వచ్చిన లేటెస్ట్ సినిమానే “మైఖేల్”. యంగ్ హీరో సందీప్ కిషన్ ఎంతో కస్టపడి చేసిన సినిమా ఇది. దర్శకుడు రంజిత్ జేయకొడి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు తమిళ్ లో ఏకకాలంలో తెరకెక్కి ఈ ఫిబ్రవరి 3న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింది.

కానీ ఈ సినిమా కంప్లీట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. సినిమాలో పెద్దగా విషయం లేదు అని తెలిసాక థియేటర్స్ లో వారం కూడా ఈ సినిమా ఉండలేదు. దీనితో ఈ లాసులు కవర్ చెయ్యడానికి ఈ  సినిమా నెల తిరక్కుండానే ఓటిటి లో స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ఆహా తీసుకోగా అందులో ఈ సినిమా ఈ ఫిబ్రవరి 24 నుంచే వచ్చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. మొత్తానికి అయితే సిల్వర్ స్క్రీన్ పై వర్కౌట్ కాని ఈ సినిమా ఓటిటి లో ఎలా పని చేస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ లాంటి స్టార్స్ ని కూడా పెట్టి డిజాస్టర్ చేసుకున్నారు.