పాన్ ఇండియా రెబల్ స్టార్ ఆయన.! కానీ, గత కొంతకాలంగా ఓ అనారోగ్య సమస్య ప్రభాస్‌ని వేధిస్తోంది. అయినాగానీ, ప్రభాస్ తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.
మొన్నీమధ్యనే, విదేశాలకు వెళ్ళిన ప్రభాస్, అక్కడ ఆ అనారోగ్య సమస్యకి చికిత్స తీసుకున్నాడు. సర్జరీ జరిగింది, రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే, మునుపటిలా సినిమాల్లో ప్రభాస్, జోరు కనిపిస్తుందా.? లేదా.? అన్నదానిపై అభిమానుల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి.
గత కొంతకాలంగా ప్రభాస్ సినిమాల్లో, ‘ఈజ్’ లోపిస్తోంది. తెరపై కష్టంగా కనిపిస్తున్నాడు ప్రభాస్. యాక్షన్ ఎపిసోడ్స్‌లో చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నాడు. ఆ ఇబ్బంది తొలగిపోయినట్లేనా.? అన్న ప్రశ్నకైతే సమాధానం దొరకడంలేదు.
‘సలార్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మారుతి దర్శకత్వంలో సినిమా నిర్మాణంలో వుంది. ‘కల్కి’ సినిమా కూడా నిర్మాణంలోనే వుంది. మారుతి సినిమాకి పెద్దగా యాక్షన్ పార్ట్ వుండదుగానీ, ‘కల్కి’ కోసమైతే ప్రభాస్, రిస్కీ స్టంట్స్ చేయాల్సి వుంటుంది.
ఆల్ ఈజ్ వెల్.. అని ప్రభాస్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుండడం కాస్త ఊరట.