కోట్లు ఖర్చు చేసి మెగాస్టార్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసిన అభిమానులు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి పేరు వింటే చాలు ఆయన అభిమానుల్లో పునకాలు వస్తాయి. వందకు పైగా సూపర్ హిట్ సినిమాలలో నటించిన చిరంజీవి కోట్ల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఆయన చెప్పే డైలాగులు, వేసే స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యి మెగాస్టార్ కి అభిమానులుగా మారిపోయారు. ఈ వయసులో కూడా చిరంజీవి కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇదిలా ఉండగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజును పండగను సెలబ్రేట్ చేయడానికి మెగా అభిమానులు నిర్ణయించుకున్నారు.

చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలను నాగబాబు దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన నాగబాబు ప్రతి ఒక్కరూ ఈ మెగా వేడుకలలో పాలుపంచుకోవాలని కోరాడు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ ఏడాది కరోనా భయం లేకపోవడం వల్ల భారీ ఎత్తున మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించడానికి ఆయన అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వారం రోజులుగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో చిరంజీవి పుట్టినరోజున పలు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడానికి దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఖర్చు మొత్తం స్థానికంగా ఉన్న చిరంజీవి అభిమానులు భరిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఇలా కోట్లు ఖర్చు చేసి వివిధ సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసి ఘనంగా నిర్వహిస్తుండటం హర్షించదగ్గ విషయం. అభిమాన సంఘాల పేరిట ఇలా సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.