బన్నీ ఒంటరి అయినట్లేనా.. నష్టం లేదంటున్న ఫ్యాన్స్!

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 ట్రైలర్ ఆఖరికి రానే వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన పుష్ప 2 ట్రైలర్ మంచి వ్యూస్ తో ట్రెండింగ్ అవుతుంది. సామాన్య ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ట్రైలర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకులు ప్రశాంత్ వర్మతో పాటు హరీష్ శంకర్, అనిల్ రావుపూడి తదితరులు తమ సోషల్ మీడియాలో ట్రైలర్ పై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు కూడా పెట్టారు.

దర్శక దిగజం రాజమౌళి కూడా పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది, ఇది దేశమంతటా విస్తరిస్తోంది డిసెంబర్ 5న చెలరేగుతుంది, పార్టీ కోసం వెయిట్ చేయలేకపోతున్నా పుష్ప అంటూ రాజమౌళి తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే ఇంతమంది పుష్ప సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తున్నప్పటికీ మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. మామూలుగానే మెగాస్టార్ విడుదలైన సినిమాలు యొక్క టీజర్లు, ట్రైలర్లపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. అయితే ఈ సినిమాపై ఎలాంటి అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్త పరచకపోవటంతో ఆ కాంపౌండ్ నుంచి ఏ హీరోలు కూడా పుష్ప 2 సినిమాపై సోషల్ మీడియా వేదికగా స్పందించకపోవడం విశేషం.

బన్నీని మెగా కాంపౌండ్ దూరం పెట్టిందని, బన్నీ ఒంటరివాడైపోయాడని అంటున్నారు నెటిజన్స్. రచ్చ గెలిచిన పుష్ప ఇంట మాత్రం ఒంటరివాడైపోయాడు అంటున్నారు ఒక వర్గం నెటిజన్స్. అయితే ఒక వర్గం మాత్రం అల్లు అర్జున్ ని వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు బన్నీకి మెగా కాంపౌండ్ సపోర్టు లేకపోయినా తనకంటూ సెపరేట్ ట్రాక్ సెట్ చేసుకొని దానిద్వారా దూసుకుపోతున్నాడు.

ఈ సినిమా ఎలా ఉండాలి అన్నది అడుగు అడుగున ప్లాన్ చేసుకుంటూ వస్తున్న బన్నీ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కాబట్టి పుష్ప 2 సినిమా విషయంలో మెగా కాంపౌండ్ సపోర్ట్ బన్నీకి లేకపోయినా ఇప్పుడు పెద్దగా వచ్చిన నష్టం ఏమీ లేదని ఇప్పటికే రిలీజ్ అయినా సినిమా ట్రైలర్స్ రుజువు చేస్తుంది. కాకపోతే అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ వేరువేరు అయ్యాయనే విషయం మరొకసారి బహిర్గతం అయింది అంతే.